జాగ్రత్తగా ఉండండి- పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కౌంటింగ్ రోజున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయించింది.

జాగ్రత్తగా ఉండండి- పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu (Photo Credit : Facebook, Google)

Chandrababu Naidu : కౌంటింగ్ రోజున జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అలర్ట్ గా ఉండాలన్నారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఈసీ, పోలీసుల తీరుపై అందుకే వారు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కీలక నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇక, ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వనుంది. కౌంటింగ్ రోజున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు రేపు సాయంత్రం అమరావతి రానున్నారు.

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?