Minister RK Roja: నాది, బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్: మంత్రి ఆర్.కె.రోజా

రోజా బాలకృష్ణతో కలిసి నటించిన భైరవద్విపం చిత్రం 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా చిత్ర విశేషాలను రోజా గుర్తు చేసుకున్నారు.

Minister RK Roja: నాది, బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్: మంత్రి ఆర్.కె.రోజా

Roja

Updated On : April 19, 2022 / 9:22 AM IST

Minister RK Roja: చిత్ర సీమలో తనది, బాలకృష్ణతో ఎంతో విజయవంతమైన కాంబినేషన్ అని, తామిద్దరం కలిసి పలు చిత్రాల్లో నటించామని సినీనటి. మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి రోజా. మంత్రి హోదాలో తొలిసారి స్వామి వారి దర్శనానికి వచ్చిన రోజాకు ఆలయ అధికారులు సాదరస్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం చేసి..స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అండదండలు, భగవంతుని ఆశీస్సులు నగిరి ప్రజల ప్రేమాభిమానాలతో తిరుపతి జిల్లాకి నన్ను మంత్రిగా ఎంపిక చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. “ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకు తోడుగా ఉంటానని” రోజా అన్నారు. తనకు కేటాయించిన టూరిజం శాఖను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని ఆమె పేర్కొన్నారు.

Also read:Toddler : పిల్లిని ముద్దులతో మంచెత్తిన చిన్నారి.. క్యూట్ వీడియో వైరల్..!

రోజా బాలకృష్ణతో కలిసి నటించిన భైరవద్విపం చిత్రం 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా చిత్ర విశేషాలను రోజా గుర్తు చేసుకున్నారు. తామిద్దరం ఎన్నో హిట్ చిత్రాల్లో నటించమని, తమది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని రోజా అన్నారు. భైరవ ద్వీపం చిత్రానికి 28 సంవత్సరాలు పూర్తి కావడం సంతోషంగా ఉందని రోజా తెలిపారు. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు అవుతోందని, భైరవ ద్వీపం చిత్రానికి 28 ఏళ్లు పూర్తయింది అంటే ఆశ్చర్యంగా ఉందని రోజా అన్నారు. విజయ వాణి బ్యానర్లో భైరవ ద్వీపం చిత్రంలో రాణి అనే పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు రోజా తెలిపారు.

Also read:YSRCP: వైసీపీలో సంస్థాగత పదవుల పంపకం.. నేడు తుది జాబితా!