Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సభా హక్కుల కమిటీ.. అసెంబ్లీ జాయింట్ కమిటీల నియామకం.. ఎవరెవరికి ఏయే పదవులంటే?

అమెనిటీస్ కమిటీ ఛైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సభా హక్కుల కమిటీ.. అసెంబ్లీ జాయింట్ కమిటీల నియామకం.. ఎవరెవరికి ఏయే పదవులంటే?

Bhumana Karunakar Reddy

Updated On : July 17, 2023 / 4:52 PM IST

Andhra Pradesh – Bhumana Karunakar Reddy: ఆంధ్రప్రదేశ్ సభా హక్కుల కమిటీ ఛైర్మన్ గా తిరుపతి (Tirupati) ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి నియమితుడయ్యారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అలాగే, ప్రివిలేజ్ (Privilege Committee) కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్య లక్ష్మి, టీజేఆర్ సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, సంబంగి చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ (రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే) నియమితులయ్యారు. అసెంబ్లీ జాయింట్ కమిటీలు నియామకం కూడా జరిగింది. 9 జాయింట్ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వివరాలు..
అమెనిటీస్ కమిటీ ఛైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ కమిటీ ఛైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని

ఎస్సీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా గొల్ల బాబురావు

ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా తెల్లం బాలరాజు

మైనారిటీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా మహ్మద్ ముస్తఫా

స్త్రీ, శిశు, వృద్ధులు, డిసేబుల్డ్ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా జొన్నలగడ్డ పద్మావతి

సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా రమేష్ యాదవ్ రాజగొల్ల

లైబ్రరీ కమిటీ ఛైర్మన్ గా రామసుబ్బా రెడ్డి

Vangalapudi Anitha: చెప్పులు చూపిస్తూ.. టీడీపీ మహిళా నేతల ర్యాలీ.. చివరకు అతడి ఇంటికి వెళ్లి..