Janasena Pawan kalyan : ‘జనసేన అధికారం’లోకి రావాలంటే పవన్‌పై ఎవరి ప్రభావం ఉండకూడదు : బీజేపీ నేత కన్నా కీలక వ్యాఖ్యలు
జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే అంశాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కే వదిలేయాలని ఆయనపై ఎవ్వరు ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా ఉండాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బయటనుంచి జనసేనను ఎవ్వరు ప్రభావితం చేయకుండా ఉంటే జనసేన అధికారంలోకి రావటం ఖాయం అంటూ పరోక్షంగా బీజేపీ నేతలపై విమర్శలు చేశారు ఏపీ BJP నేత కన్నా లక్ష్మీనారాయణ.

BJP leader Kanna Lakshminarayana's key comments about Janasena party
Janasena Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ ఆయా పార్టీలు ముఖ్యంగా టీడీపీ,జనసేన,వైసీపీలు కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ఇది పక్కా అనేలా వార్తలు వస్తున్నాయి. మరోపక్క బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్న క్రమంలో టీడీపీ పొత్తులో ఉంటే జనసేనతో కలిసేది లేదంటూ ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చెబుతున్నారు. కానీ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మాత్రం జనసేన అధికారంలోకి రావాలంటే ఈ అంశాన్ని పవన్ కే వదిలేయాలి..పవన్ అలా ఉంటే అధికారం పక్కా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే అంశాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కే వదిలేయాలని ఆయనపై ఎవ్వరు ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా ఉండాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బయటనుంచి జనసేనను ఎవ్వరు ప్రభావితం చేయకుండా ఉంటే జనసేన అధికారంలోకి రావటం ఖాయం అంటూ పరోక్షంగా ఏపీ బీజేపీ నేతలచడ విమర్శలు చేశారు కన్నా.
అదే సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పై విమర్శలు చేశారు కన్నా. జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానం చేయించుకుంటున్నారు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో జీవీఎల్ పార్లమెంట్ లో అడిగిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లో కొడితే అర్థమైపోతుంది అంటూ సెటైర్లు వేశారు. అలాగే వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేసిన కన్నా వైఎస్సార్ హయాంలోనే కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. కానీ అప్పుడు అది సాధ్యంకాలేదని ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈడీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకుని కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారు అంటూ కన్నా అన్నారు. కాగా..కన్నా వ్యాఖ్యలు చూస్తుంటే అటు జనసేనలో గానీ..ఇటు టీడీపీలో గానీ చేరేలా ఉన్నాయి.
కాగా..ఇటీవల కాలంలో బీజేపీకి కన్నా దూరంగా ఉంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు, కన్నాకు మధ్య విభేధాలు ఉన్న క్రమంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కన్నా అటు జనసేనకు ఇటు టీడీపీపై సానకూల వ్యాఖ్యలు చేయటం చూస్తే ఈ రెండింటిలో ఏదోక పార్టీలో చేరతారని తెలుస్తోంది.కానీ కన్నా టీడీపీ కంటే జనసేనలో చేరటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు ఆయన అనుచరులు.
కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే సోము వీర్రాజుని ఉద్ధేశించి అన్నట్లుగా ఉన్నాయంటున్నారు పలువురు బీజేపీ నేతలు. ఎందుకంటే సోము వీర్రాజు పొత్తుల గురించి మాట్లాడుతూ.. తమ పొత్తు జనసేనతోనేనని ఉంటుందని.. జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్నారు. కానీ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం పవన్ తో కలిసేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు కన్నా చూస్తే అటు జసేన, ఇటు టీడీపీ గురించి సానుకూల వ్యాఖ్యలే చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ ప్రభావం పవన్ పై ఉండకూడదంటున్నారా? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.