ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ వైసీపీ కొత్త డ్రామాలు.. సత్యకుమార్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని వచ్చేంత వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు సత్యకుమార్ మండిపడ్డారు.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ వైసీపీ కొత్త డ్రామాలు.. సత్యకుమార్ ఫైర్

BJP Leader Satya Kumar slams YV Subba Reddy comments on AP capital

Updated On : February 13, 2024 / 4:43 PM IST

BJP Leader Satya Kumar: విశాఖపట్నం రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెర లేపిందని విమర్శించారు. 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టకుండా, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలని కోరడం ఏంటని ప్రశ్నించారు.

మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను మోసం చేశారని.. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

నమ్మబలకడం, నయవంచనకు పాల్పడడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానానికి మద్దతు తెలిపారు. ఇంకా నమ్మించడం కోసం నేను అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నానని ఇంకా నమ్మబలికారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవన్నీ మర్చిపోయి మూడు రాజధానులు అంటూ కొత్త చర్చకు శ్రీకారం చుట్టారు. వైసీపీ నేతల ప్రధాన ఉద్దేశం దోచుకోవడం తప్పా.. ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలన్న ఆలోచన లేదు. అమరావతిని నిర్మిస్తే ఎవరు అడ్డుపడ్డారు? అమరావతి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలు ప్రటించింది. 65 వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర సిద్ధపడిందని సత్యకుమార్ తెలిపారు.

Also Read: ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..