AP Special Status:ఏపీకి ప్రత్యేక హోదా..కేంద్ర కమిటీ ఎజెండాలో తొలగింపుపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి జీవీఎల్ లేఖ
ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేంద్ర కమిటీ ఎజెండాలో తొలగింపుపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి జీవీఎల్ లేఖ రాశారు.

Ap Special Status
AP special status issue says GVL Letter to Central Home : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు బీజేపీ నేత..జీవీఎల్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ సమావేశ అజెండా నుంచి ప్రత్యేకహోదాతో పాటు కొన్ని అంశాల తొలగింపుపై ప్రకటన విడుదల చేయాలని లేఖలో కోరారు. అజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయడానికి మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. విభజన చట్టానికి సంబంధం లేని నాలుగు అంశాలను పొరపాటున అజెండాలో పెట్టారని… ఏపీకి మాత్రమే సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకుంటే సరిపోతుందని..అలాగే ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు సంబంధం లేదని జీవీఎల్ స్పష్టంచేశారు.
ఈ విషయాన్ని వైసీపీ, టీడీపీ, సీపీఎం రాజకీయ కోణంలో చూస్తున్నాయని..సవరించిన అజెండాతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని జీవీఎల్ స్పష్టంచేశారు. అజెండాలో తొలగించిన అంశాలపై 17న జరిగే సమావేశంలో వివరించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీల అంశంపై దృష్టి పెట్టిన కేంద్రం దానిపై ఓ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే.ఈ కమిటీలో చేర్చిన అంశాలను చర్చించి వాటిని అమలు చేసేశాల చూడాలని హోంశాఖకు రాసిన లేఖలో జీవీఎల కోరారు.
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని తొలుత ప్రస్తావించింది బీజేపీనే అని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేకహోదా అంశాన్ని పెట్టినప్పటికీ ఆ తర్వాత తొలగించారు.
Also read : Somuveerraju : ప్రత్యేక హోదాతో తెలంగాణకు సంబంధం లేదు.. అందుకే తొలగించారు-సోమువీర్రాజు
కాగా..ఏపీ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం కమిటీ వేసింది అనగానే వైసీపీ సొంత డబ్బా కొట్టుకోవటం ప్రారంభించింది. వైసీపీ ఎంపీలో పార్లమెంట్ లో చేసిన పోరాటానికి..సీఎం జగన్ ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా అంశం గురించి అడిగినట్లుగాను అందుకే కేంద్రం ఈ విషయంపై దృష్టిపెట్టింది అన్నట్లుగా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ డబ్బా కొట్టుకున్నారు. ఆ తరువాత ఈ కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించేసరికి ఢంగైపోయారు.
కాగా..ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 17న జరిగే సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశం చేర్చి.. మళ్లీ తొలగించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విటర్‌లో స్పందించారు.
వైసీపీ ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించానని..కేంద్ర హోంశాఖ నోట్‌పై ఆరా తీశానని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం రెండు రాష్ట్రాల కమిటీ అజెండాలో ఉండేది కాదని తెలిసిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా? అని ప్రశ్నించిన జీవీఎల్.. ఈ విషయం ఆలోచిస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర హోం శాఖ నోట్‌ను తాను చూశానని…దాని గురించి నేను అధికారులతో మాట్లాడానని ఆ తర్వాతే వివరణ ఇస్తున్నానని స్పష్టం చేశారు.
Also read : GVL Narasimaharao: మీ సీఎంతో కనీసం అపాయింట్మెంట్ సాధించండి వైకాపా ఎంపీలపై జీవీఎల్ నరసింహారావు ఫైర్
ఫిబ్రవరి 17న జరిగే కేంద్ర ప్రభుత్వ సమావేశానికి సంబంధించిన అజెండా కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలను చర్చించడానికి మాత్రమే సవరించబడిందని జీవీఎల్ సుస్పష్టం చేశారు. గత అజెండాలో పొరపాటున ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలను చేర్చారని ప్రత్యేక హోదా ప్రస్తావనపై క్లారిటీ ఇచ్చారు.ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై చర్చ ఉంటుందని ప్రస్తావించిన తరుణంలో దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్రంలోని సీనియర్ అధికారులతో మాట్లాడానని..ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు. ఇది కేవలం ఏపికి సంబంధించిన అంశం మాత్రమే. రెవెన్యూ లోటు కూడా ఏపీకి మాత్రమే సంబంధించిన అంశం.
ఈ రెండు అంశాలు జాబితాలోకి ఎలా వచ్చాయని వివరణ కోసం విచారిస్తే..ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో.. అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ. ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు ఆస్కారం లేదని తెలిసింది. కానీ, ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవపట్టించే విధంగా ఉంది. అందుకే ఈ వివరణ ఇస్తున్నానిని జీవీఎల్ తెలిపారు.