AP BJP : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే ఆమోద ముద్ర, మా పయనం జనసేనతోనే

జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్బాటం ఎక్కువని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా... ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ...

AP BJP : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే ఆమోద ముద్ర, మా పయనం జనసేనతోనే

Gvl

Updated On : February 18, 2022 / 1:06 PM IST

BJP MP GVL Narasimha Rao : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే ఆమోద ముద్ర పడుతుందని, తమ పయనం జనసేనతోనేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. బీజేపీ పార్టీ 404 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేసేందుకు నితిన్‌ గడ్కరీ ఏపీకి వచ్చారు. సీఎం జగన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2022, ఫిబ్రవరి 18వ తేదీ శుక్రవారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు.

Read More : YCP MLA Anam : కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాష్ట్రంలో 51 వేల జాతీయ రహదారులను ప్రారంబించారని, బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి అర్దమౌతుందన్నారు. ఏపీపై గడ్కరి వరాల వెల్లువ ప్రకటించారని, రానున్న రోజులలో లక్షల కోట్లతో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ చేయనున్నారని వెల్లడించారు. వేల కిమీ రహదారుల నిర్మాణం జరుగుతుందని, ఆరు సంవత్సరాల కాలంలో జాతీయ రహదారి నిర్మాణాలు రెట్టింపయ్యాయని తెలిపారు. జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి భూ సేకరణకు అడ్డంకులు వచ్చాయని, ఈ విషయంలో భూసేకరణకున్న అడ్డంకులను వైసీపీ ప్రభుత్వం సెటిల్ చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : Nitin Gadkari : ఏపీలో భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. షెడ్యూల్ ఇదే..!

అయితే.. జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్బాటం ఎక్కువని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా… ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ తన స్టిక్కర్ వేసుకుంటూ ప్రచారం చేసుకొంటోందని, మిర్చి పంటతో రైతులు 80 శాతం నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. కేంద్ర పథకం ఫసల్ భీమా యోజన వద్దని చెప్పడంతో రైతులు పూర్తిగా నష్ట పోయారన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి అభద్రతాబావం ఏర్పడిందని, గతం నుండి అక్కడి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నారు ఎంపీ జీవీఎల్.