కొడాలి నాని సీటు కిందకు నీళ్లు.. వంశీ పారిపోయాడు: బొండా ఉమ హాట్ కామెంట్స్

గుడివాడ సీటు నుంచి కొడాలి నానికి ట్రాన్సఫర్ తప్పదేమో. కొడాలి నాని సీటు కిందకు నీళ్లొచ్చాయి. వల్లభనేని వంశీ పోటీ చేయనని పారిపోయాడని బొండా ఉమ వ్యాఖ్యానించారు.

కొడాలి నాని సీటు కిందకు నీళ్లు.. వంశీ పారిపోయాడు: బొండా ఉమ హాట్ కామెంట్స్

bonda umamaheswara rao comments on kodali nani gudivada seat

Bonda Umamaheswara Rao: కొడాలి నానిని గుడివాడ నుంచి తప్పిస్తారనే ప్రచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని సీటు కిందకు నీళ్లొచ్చాయని, ఆయనకు ట్రాన్సఫర్ తప్పదేమోనని అన్నారు. ”కొడాలి నాని పనికి మాలిన వాడని తెలిసే జగన్ మంత్రి పదవి తీసేశాడు. గుడివాడ సీటు నుంచి కొడాలి నానిని తప్పించడం పెద్ద విషయమేం కాదు. వల్లభనేని వంశీ పోటీ చేయనని పారిపోయాడ”ని బొండా ఉమ వ్యాఖ్యానించారు.

రాంబాబూ.. టైం వేస్ట్ చేసుకోవద్దు
చంద్రబాబు ఓపెన్ చాలెంజ్‌పై మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీటుపై స్పందిస్తూ.. ”సంబరాలు రాంబాబు తన టైం వేస్ట్ చేసుకోవద్దు. తాడేపల్లిలో పడుకున్న జగన్ను నిద్ర లేపి.. సవాల్ స్వీకరించాలని రాంబాబు ఒప్పించాలి. చంద్రబాబు సవాల్ స్వీకరించకుంటే మా పరువు పోతోందని అంబటి రాంబాబు సీఎం జగనుకు నచ్చచెప్పాలి. అంబటి కోతలు మాని.. జగన్నునిద్ర లేపే విషయమై దృష్టి సారించాల”ని అన్నారు.

Also Read: చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్.. ఏమన్నారంటే..

జగన్ ఎందుకు మాట్లాడడం లేదు?
చంద్రబాబు సవాల్ పై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడరని, బహిరంగ చర్చకు చంద్రబాబు సవాల్ విసిరినా జగన్ ఎందుకు మాట్లాడడం లేదని బొండా ఉమ ప్రశ్నించారు. వైసీపీ సభల్లో మాట్లాడేసి.. తాడేపల్లి ప్యాలెస్సులోకి వెళ్లి తలుపులేసుకుంటే సరిపోతుందా? తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టైనా నిన్ను బయటకు తెచ్చి సమాధానం చెప్పిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ”జగన్ చెప్పినట్టు ఫ్యాన్ లోపలే ఉంటుంది.. సైకిల్ ప్రజల మధ్య ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో జగన్ చాలా హామీలిచ్చి.. వాటిని తుంగలో తొక్కారు. 99 శాతం హామీలన్ని నెరవేర్చినట్టు జగన్ బుకాయిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేశారా..? మద్యనిషేధం చేశారా..? ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల సంగతేంటి..? తానిచ్చిన హామీల్లో 85 శాతం హామీలను జగన్ గాలికి వదిలేశారు. హామీలను అమలు చేయలేదని మేం బుక్ వేస్తే.. మా ప్రశ్నలకు సమాధానమే లేదు.

చంద్రబాబు అంటే అభివృద్ధి, సంక్షేమం. జగన్ అంటే జైలు.. విధ్వంసం, ఛార్జీషీట్లు. జగన్ చరిత్రంతా మరకలే. మేం ఎక్కడైనా చర్చకు సిద్దంగా ఉన్నాం. మీడియా సాక్షిగా చర్చకు సిద్దం. చర్చిద్దామంటే తాడేపల్లి తలుపులు ఎందుకు మూస్తారు? రూ. 2.40 లక్షల కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిపారు. ఇందులో లాభం రూ. 2 లక్షల కోట్లు. ఇసుక ద్వారా రూ. 50 వేల కోట్లు ఆదాయం. ఆడపడుచుల తాళిబొట్లు తెంపి.. కార్మికుల పొట్టకొట్టి ఐదేళ్లల్లో రూ. 2.50 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ డబ్బులను సంక్షేమం కోసం ఖర్చు పెట్టానని జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నారు.

Also Read: గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

సిద్దం సభ ఐదింటికి ముగిస్తే.. ఆరింటికి చర్చకు సిద్దం అని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో ఏం చేయలేదంటూ రాప్తాడు సభలో సీఎం జగన్ అర్థం లేకుండా మాట్లాడారు. రాప్తాడు సిద్దం సభకు వెళ్లిన రోడ్డు వేసిందే చంద్రబాబు. చంద్రబాబు – జగన్ పరిపాలనపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరితే ఎవ్వరూ మాట్లారే..? సిద్దం సభ సక్సెస్ అయితే మీడియాపై దాడులెందుకు..? దెబ్బలు తిన్న విలేకర్లు చావు బతుకుల మధ్య ఉన్నారు. తప్పు చూపితే దాడులా..? తునిలో ఓ విలేకరిని చంపేసిన చరిత్ర వైసీపీద”ని బొండా ఉమ ఆరోపించారు.