విజయవాడ వెస్ట్ టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న భారీ ర్యాలీ
పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టిక్కెట్లు ఇవ్వాలి. సీటు రాలేదని మా పార్టీ వాళ్ళు చంద్రబాబును తిట్టినా తాట తీస్తానని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

Buddha Venkanna conducted rally for Vijayawada west TDP ticket
Buddha Venkanna Rally: విజయవాడ పశ్చిమ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న గురువారం తన నివాసం నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ వరకు ర్యాలీచేపట్టారు. విజయవాడ వెస్ట్ సాధ్యం కాదనుకుంటే, అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. రెండు స్థానాలనూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం నేపథ్యంలో బుద్దా వెంకన్న అలర్ట్ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ చేట్టారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నానని.. ఎన్నికల్లో నిలబడటానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. పనిలో పనిగా ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ”చంద్రబాబు నాకు దైవసమానులు.. ఆయనకు ఇచ్చే అప్లికేషన్ ను ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చాను. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చాను. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాను. నా అప్లికేషన్ పరిశీలించాలని చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నాను.
Also Read: ఆశ్చర్యకరంగా పులివెందులలో వైఎస్ జగన్ ఓడిపోబోతున్నారు: కేశినేని చిన్ని
కేశినేని నానికి బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చాను. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. నేను అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే భారీగా కేడర్ వచ్చారు. చంద్రబాబు-పవన్ గురించి చెడుగా మాట్లాడితే తాట తీస్తాను. దమ్ముంటే రండి.. మీరో మేమో చూసుకుందాం. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టిక్కెట్లు ఇవ్వాలి. సీటు రాలేదని మా పార్టీ వాళ్ళు చంద్రబాబును తిట్టినా తాట తీస్తాన”ని హెచ్చరించారు.