Buddha Venkanna: జగన్ రేపో మాపో ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.. ఇక మేము..: బుద్దా వెంకన్న
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ చేసి గెలవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు.

Buddha Venkanna
Buddha Venkanna – YS Jagan: ముఖ్యమంత్రి జగన్ రేపో మాపో ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమయ్యారని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. కాకినాడ (Kakinada) రూరల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను బుద్దా వెంకన్న ప్రారంభించారు.
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ చేసి గెలవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ రద్దు అవుతుందని అన్నారు.
దేశంలో ముఖ్యమంత్రులందరిలోనూ వైఎస్ జగన్ అత్యంత ధనవంతుడని చెప్పారు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ ఆస్తి రూ.8 కోట్లు ఎక్కువ ఉందని అన్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు జగన్ ఆస్తి ఎంత అని నిలదీశారు. ఇప్పుడు అంతగా ఎలా పెరిగిందని ప్రశ్నించారు.
మంత్రి పదవిని త్యాగం చేసిన వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను సీఎం జగన్ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కాగా, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఊహాగానాలను వైసీపీ నేతలు కొట్టపారేస్తున్నారు.
Fish Rain : శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం.. రోడ్లపై చేపలు చూసి ఎగబడిన జనం