వావ్‌.. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు.. ఏమేం దక్కాయో తెలుసా? కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ఏమన్నారు?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులకు నిధులపై నిర్మలా సీతారామన్‌ ఏం చెప్పారో తెలుసా?

వావ్‌.. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు.. ఏమేం దక్కాయో తెలుసా? కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ఏమన్నారు?

Nirmala Sitharaman, Chandrababu

Updated On : February 1, 2025 / 4:34 PM IST

Budget 2025: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు పనులకు నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌, వైజాగ్‌ పోర్టుకు నిధులు దక్కాయి.

పోలవరానికి, రూ.5,936 కోట్లు, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, వైజాగ్‌ పోర్టుకు రూ.730 కోట్లు ఇచ్చారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్యాలెన్స్‌ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్లు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధికి రూ.162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు రూ.375 కోట్లు, అలాగే, రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు, ఇరిగేషన్‌, లైవ్లీ హుడ్‌కు ప్రాజెక్టుకు రూ.242.50 కోట్లు కేటాయించారు.

Budget 2025 : బడ్జెట్ బిగ్ ఎఫెక్ట్.. ఏం పెరుగుతాయి? ఏం తగ్గుతాయి? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..

చంద్రబాబు స్పందన
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రజల ఆశలకు తగ్గట్టు, ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్‌ విజన్‌ను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్‌ మహిళల, పేదల, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో రాబోయే ఐదేళ్లలో ఆరు కీలక రంగాల వృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.

ఈ బడ్జెట్ జాతీయ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా ప్రవేశపెట్టారని చెప్పారు. భారత భవిష్యత్తుకు సమగ్ర బ్లూప్రింట్‌గా ఈ బడ్జెట్‌ పనిచేస్తుందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి వారికి పన్నుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పారు.