Bus Accident : ఏపీలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు..

Bus Accident : ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి దగ్దమైంది.

Bus Accident : ఏపీలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు..

Nandyal Road Accident

Updated On : January 22, 2026 / 10:55 AM IST

Bus Accident : ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి దగ్దమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. కొందరు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకుంది.

Also Read : మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్‌.. కాల్పుల కలకలం

నెల్లూరు నుంచి 36మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ బయలుదేరింది. శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తోపాటు, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు క్లీనర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న డీసీపీ వ్యాన్ డ్రైవర్ బస్సు అద్దాలను పగలగొట్టడంతో కొందరు ప్రయాణికులు బస్సు నుంచి బయటకు వచ్చారు. మరికొందరు బస్సు కిటికీల్లోనుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.

గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాణ్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సుతోపాటు ప్రయాణికుల లగేజీ మొత్తం దగ్దమైంది. బస్సు డ్రైవర్ తోపాటు లారీ డ్రైవర్, క్లీనర్ ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి.