2017-18లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదిక..

2017-18 ఆర్థిక ఏడాదికి సంబంధించి పలు అంశాలపై ఏపీ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదిక విడుదల అయింది. 231 రోజుల పాటు ఓడీలు తీసుకుని సకాలంలో చెల్లించేదని నివేదికలో తెలిపింది. ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కార్ తీరును కాగ్ తప్పు పట్టింది. 2017-18లో 231 రోజులు ఓవర్ డ్రాప్ట్‌లే ఉన్నాయని పేర్కొంది.
అప్పటి ప్రభుత్వం దుబారా ఖర్చుల వల్ల రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసినట్టు తెలిపింది. 2018 మార్చి నాటికి అప్పులు రూ.2,23,706 కోట్లకు పెరిగాయని కాగ్ వెల్లడించింది. ఓవర్ డ్రాప్ట్ రూపంలో రూ.45,860.75 కోట్లు తీసుకుందని తెలిపింది. తీసుకున్న మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడం వల్లే రూ.44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందని కాగ్ పేర్కొంది.
ద్రవ్యలోటును అదుపు చేయంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. రుణాల నిష్పత్తి 18.27 శాతం నుంచి 22.51 శాతానికి పెరిగినట్టు తెలిపింది. పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేశారని వెల్లడించింది. తీర్చాల్సిన రుణం రూ.91,599.22 కోట్లకు పెరిగిందని కాగ్ నివేదికలో వివరించింది. రూ.230 కోట్ల గ్రామీణాభివృద్ధి సెస్ నిధులు మాయం అయినట్టు తెలిపింది. 2017-18లో రూ.34,602 కోట్లు తక్కువ ఖర్చు చేశారని కాగ్ నివేదిక వెల్లడించింది.