Kottu Satyanarayana : అప్పుడు జరిగిన దోపిడీ, అవినీతి నీకు కనిపించ లేదా? పవన్ కల్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్

Kottu Satyanarayana : నువ్వసలు రాజకీయలు చేయడానికి పార్టీ పెట్టావా? తిట్టడానికి పార్టీ పెట్టావా?

Kottu Satyanarayana : అప్పుడు జరిగిన దోపిడీ, అవినీతి నీకు కనిపించ లేదా? పవన్ కల్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్

Kottu Satyanarayana(Photo : Twitter)

Updated On : July 12, 2023 / 9:50 PM IST

Kottu Satyanarayana – Pawan Kalyan : ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలు అభిమానించే ముఖ్యమంత్రి జగన్ ను సంస్కారహీనుడు అనడం దారుణం అన్నారు. ప్రజల్లో తిరిగిన తర్వాత, ప్రజాగ్రహం చూసిన తర్వాత పవన్ కల్యాణ్ మారతాడని ఆశించాము, కానీ పవన్ లో మార్పు రాలేదన్నారు.

” నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలు, గణాంకాలు ఎవరు రాసి ఇచ్చారు? తెలుగుదేశం హయాంలో జరిగిన దోపిడీ, దుర్మార్గపు అంశాలు ఎందుకు నీకు కనిపించడం లేదు? పోలవరం ప్రాజెక్ట్ 2019 నాటికి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో? ఇలా ఉండడానికి కారణం ఎవరో? తెలిసే మాట్లాడుతున్నావా? కనీస జ్ఞానం లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి కోట్లు దోచేశారు. వరదల్లో అది కొట్టుకుపోయింది.

Also Read..Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా..

గౌరవప్రదమైన సేవా ధృక్పథంతో వాలంటీర్లు పని చేస్తున్నారు. అలాంటి వాలంటీర్లును ఎవరి మెప్పు కోసం తిడుతున్నావ్? నీ మాటలు నువ్వు మళ్ళీ ప్లే చేసుకుని చూడు. ఎవరు సంస్కారహీనుడో తెలుస్తుంది. పవన్.. నువ్వసలు రాజకీయలు చేయడానికి పార్టీ పెట్టావా? తిట్టడానికి పార్టీ పెట్టావా? జగన్ ని తిట్టడానికి మాత్రమే పవన్ యాత్రలు చేస్తున్నాడు. పవన్ సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నాడు.

జనసేన అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యం అమ్మిస్తాను. కుర్రాళ్లతో తాగిస్తాను అన్నట్లు ఉంది పవన్ తీరు. ప్రజలు.. జరిగే మేలు గురించి, అందుతున్న అంశాల గురించి ఆలోచిస్తారు తప్ప చంద్రబాబు, పవన్ గురించి ఆలోచించరు. మీరు చెప్పిన ఫిగర్స్ కి మీరు నిలబడతారా? జన్మభూమి పేరుతో విచ్చలవిడి అవినీతి జరిగితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాలంటీర్లు ఇచ్చిన డేటా హైదరాబాద్ తీసుకెళుతున్నారు అనడానికి పవన్ దగ్గర ఎటువంటి ఆధారం ఉంది?

Also Read..Chandrababu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వివాహ వ్యవస్థపై పవన్ కి సదాభిప్రాయం లేదు. పవన్ పెళ్లిళ్లు అన్నారే కానీ పెళ్లాలు అనలేదు. రాజులు అప్పట్లో ఆరేడుగురిని పెళ్లి చేసుకొనేవారు. అందులో అన్నీ బాగున్న ఒకరిని సతీమణి అనేవారు. ఎవరిని సతీమణి అనాలి? అని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ.