అమరావతి మహిళా రైతుల పాదయాత్ర.. అడ్డుకున్న పోలీసులు

రాజధాని మహిళా రైతులు పాదయాత్రగా విజయవాడ బయలుదేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్ర చేస్తున్నారు.

అమరావతి మహిళా రైతుల పాదయాత్ర.. అడ్డుకున్న పోలీసులు

Updated On : March 8, 2021 / 11:04 AM IST

Women farmers padayatra : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని మహిళా రైతులు పాదయాత్రగా విజయవాడ బయలుదేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్ర చేస్తున్నారు.

అయితే విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పి మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజామునుంచే రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ మహిళా రైతులు ఆందోళనకు దిగారు.

రాజధాని అమరావతి గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తుగా భారీగా బలగాలను మోహరించారు. సచివాలయ ముట్టడికి మహిళలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.