ఈ సాయంత్రమే ఏపీ అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు!

  • Published By: srihari ,Published On : June 16, 2020 / 09:32 AM IST
ఈ సాయంత్రమే ఏపీ అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు!

Updated On : June 16, 2020 / 9:32 AM IST

మరోసారి అసెంబ్లీ ముందుకు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు రానున్నాయి. మంగళవారం (జూన్ 16) సాయంత్ర ఏపీ అసెంబ్లీలో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే మండలిలో బిల్లలను అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహలను సిద్ధం చేస్తోంది.

గతంలోనే ఈ రెండు బిల్లులను మండలిలో తిరస్కరించిన సంగతి తెలిసిందే. వారం రోజులు పాటు మండలి నిర్వహించాలని టీడీపీ కోరిన నేపథ్యంలో రెండు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబంధించి బిల్లు, సీఆర్డీఏ బిల్లలను  కూడా పూర్తిగా వ్యతిరేకిస్తామని టీడీపీ స్పష్టం చేసింది. 

గతంలోనే ఈ రెండు బిల్లలును టీడీపీ  వ్యతిరేకించి కమిటీ కూడా వేసింది. అయినప్పటికీ మళ్లీ అసెంబ్లీ ముందుకు ఈ రెండు బిల్లులు తీసుకురావడం సరికాదని స్పష్టం చేసింది. రెండింటికి సంబంధించి కోర్టులోనూ, గవర్నర్ పరిధిలోనూ రెండు బిల్లులు ఉన్నాయి. వీటిని సభలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామని మండలిలో టీడీపీ నిర్ణయించింది. మళ్లీ బిల్లులను తిరిగి వెనక్కి పంపేలా ప్రతిపాదనను పరిశీలిస్తామని టీడీపీ నిర్ణయించింది.