YS viveka case : అవినాశ్‌రెడ్డి విచారణ అంతా వీడియో గ్రఫీ చేస్తున్న సీబీఐ
వివేకా హత్య కేసులో చేతులు మారిన రూ.40కోట్ల లావాదేవీలు..హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి కాల్స్ లిస్టుపై సీబీఐ ఆరా తీస్తోంది. హత్య జరిగితే దాన్ని సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు? మృతదేహానికి కుట్లు ఎందుకు వేయించారు?ఈ కేసులో నిందుతులుగా ఉన్నవారితో ఉన్న ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ప్రశ్నలు కురిపిస్తోంది.

YS Viveka case
YS viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా విచారిస్తున్న సీబీఐ అతని విచారణ మొత్తాన్ని వీడియో గ్రఫీ చేస్తోంది. రెండు రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈవిచారణలో వివేకా హత్య కేసులో చేతులు మారిన రూ.40కోట్ల లావాదేవీలు..వివేక హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి కాల్స్ లిస్టుపై ఆరా తీస్తోంది. పలు కోణాల్లో పశ్నలు వర్షం కురిపిస్తోంది. హత్యకు ప్లాన్ వేసినట్లుగా మా వద్ద ఆధారాలున్నాయని అవినాశ్ కు స్పష్టంగా చెప్పిన సీబీఐ హత్య జరిగితే దాన్ని సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు? మృతదేహానికి కుట్లు ఎందుకు వేయించారు?ఈ కేసులో నిందుతులుగా ఉన్నవారితో ఉన్న ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ప్రశ్నలు కురిపిస్తోంది. అలాగే హత్య చేయించేంతగా వివేకా, అవినాశ్ రెడ్డి కుటుంబాల మధ్య ఉన్న విభేధాలేంటి? ఈ హత్యలో పాల్గొన్న పాత్రధారులతో ఎటువంటి సంబంధాలున్నాయి? ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు, లావాదేవాలు వంటి పలు కీలక అంశాలపై అవినాశ్ రెడ్డిని సీబీఐ వరుసగా రెండు రోజులుగా విచారిస్తోంది. మూడవరోజు కూడా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.
Andhra Pradesh : విశాఖలో కాపురం పెడతానంటున్నావు ఎవరిని ఉద్ధరించటానికి : యనమల సెటైర్లు
కాగా వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అనూహ్యంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచగా 14రోజులు రిమాండ్ విధించింది సీబీఐ కోర్టు. దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. సీబీఐ విచారణ కోసం జైలునుంచి భాస్కర్ రెడ్డిని సీబీఐ కష్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతోంది. అనంతరం తిరిగి జైలుకు అప్పగిస్తోంది.
ఇదిలా ఉంటే తండ్రిని అరెస్ట్ చేసినట్లుగా తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీష్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం అవినాశ్ ను ఏప్రిల్ 25 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తునే 24 వరకు ప్రతీరోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో అవినాశ్ రెడ్డి గత రెండు రోజుల నుంచి సీబీఐ విచారణకు హాజరువుతున్నారు. ఈ విచారణలో భాగంగా మొదటి రోజు అవినాశ్ తో పాటు అతని తండ్రి భాస్కర్ రెడ్డిని ఇదే కేసులో అరెస్ట్ అయిన చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న ఉదయ్ భాస్కర్ రెడ్డి ముగ్గురిని కలిసి విచారించారు సీబీఐ అధికారుల. ఆ తరువాత విడివిడిగా కూడా విచారించారు. ఇలా అవినాశ్ రెండు రోజులుగా వరసగా విచారణకు హాజరుఅవుతున్నారు. ఇలా అవినాశ్ విచారణను సీబీఐ వీడియో గ్రఫీ చేస్తోంది. ఈక్రమంలో మూడవ రోజు (ఏప్రిల్ 21,2023)న కూడా అవినాశ్ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.
కాగా అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయంపై వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. మరి ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు, సూచనలు ఇస్తుందో వేచి చూడాలి.