కేంద్రం ఆమోదించక ముందే వైజాగ్‌కు సీఎం జగన్

మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోయినా, అనధికారికంగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంతో అక్కడ నుంచి క్లారిటీ వచ్చే లోపే గ్రౌండ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. అయితే, తొలుత విశాఖ కేంద్రంగా సీఎం తన పాలనా వ్యవహారాలను ప్రారంభిస్తారని అంటున్నారు.
ఓ పక్క మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉండటం.. మరో పక్క వికేంద్రీకరణ బిల్లు మండలిలో పెండింగ్ ఉండటం వంటి సమస్యలు తొలగిపోయేంత వరకూ అధికారికంగా సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖలు తరలించకుండా సీఎం మాత్రమే విశాఖ నుంచి పాలన చేయాలని డిసైడ్ అయ్యారంట. తర్వాత పరిస్థితులను బట్టి పూర్తిగా తరలించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
సీఎం విశాఖ వెళ్లేందుకు వచ్చే నెలలోనే ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. సీఎం కోసం ఓ భవనాన్ని పైనల్ చేశారని తెలుస్తోంది. మొదట్లో మిలీనియం టవర్స్‌లో అనుకున్నా వాస్తు బాగా లేదనే కారణంతో దానిపై నిర్ణయం వెనక్కి తీసుకున్నారట. అయితే తాజాగా రిషికొండ ప్రాంతంలో సీఎం నివాసంతోపాటు క్యాంపు కార్యాలయం ఉండేలా ఓ బంగ్లాను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులోకి వెళ్లేందుకు ఏప్రిల్ 4వ తేదీని ముహూర్తంగా పిక్స్ చేశారని అనుకుంటున్నారు.
ఒక పక్క రాజధాని విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నా.. వాటి గురించి పట్టించుకోకుండా జగన్ మాత్రం తన నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోపక్క, విశాఖలో పర్యటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన పర్యటించినప్పుడు ఎయిర్‌పోర్టులోనే వైసీపీ శ్రేణులు అడ్డగించాయి.
దీంతో పోలీసు వర్గాలు కూడా చంద్రబాబును ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కు పంపేశాయి. ఇదే సమయంలో ఇప్పుడు విశాఖ నుంచి పరిపాలన మొదలుపెట్టాలని సీఎం జగన్ కూడా సిద్ధమవడం చర్చనీయాంశం అయ్యింది. ఎన్నిఅడ్డంకులు వచ్చినా మూడు రాజధానుల అంశంలో ముందుకు వెళ్లాలనే పట్టుదలతోనే ఉన్నారు.
See More :
* టీడీపీ కంచుకోటలో ఆ సీటు దక్కేదెవరికీ..
* కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన జేసీ