Central Government : ఏపీలో పంచాయతీ నిధుల మళ్లింపుపై కేంద్రం విచారణ.. కేటాయింపు, వ్యయంపై ప్రజాభిప్రాయ సేకరణ

కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు పంచాయతీలను సందర్శించి నిధుల కేటాయింపు, వ్యయం తదితర అంశాలపై అధికారులు విచారణ జరపనున్నారు.

Central Government : ఏపీలో పంచాయతీ నిధుల మళ్లింపుపై కేంద్రం విచారణ.. కేటాయింపు, వ్యయంపై ప్రజాభిప్రాయ సేకరణ

AP panchayat funds diversion

Central Government – Panchayat Funds : ఏపీలో పంచాయతీ నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీలకు కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందన్న ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వాస్తవాలు తెలుసుకునేందుకు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయకుమార్‌ పర్యటించనున్నార.

కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు పంచాయతీలను సందర్శించి నిధుల కేటాయింపు, వ్యయం తదితర అంశాలపై అధికారులు విచారణ జరపనున్నారు. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిందా? లేదా? అనేది సర్పంచులు, కార్యదర్శులను అడిగి తెలుసుకోనున్నారు. నిధుల వ్యయంపై అధికారులు ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు.

PM Modi Telangana Tour: తెలంగాణలో మోదీ పర్యటన తేదీలు ఖరారు.. బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ..

రాష్ట్రానికి కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో 8660 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని ఏపీ పీఆర్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌ రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం, ఇతర ప్రతినిధుల బృందం గత నెల కేంద్ర ఆర్ధికమంత్రికి ఫిర్యాదు చేశారు.