AP Medical Colleges : ఏపీలో 3 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  వాటిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విశాఖ జిల్లా పాడేరు, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో  ఏర్పా

AP Medical Colleges : ఏపీలో 3 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం అనుమతి

Ys Jagan Mohan Reddy

Updated On : December 14, 2021 / 6:02 PM IST

AP Medical Colleges :  ఆంధ్రప్రదేశ్‌లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు  ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పవార్‌ తెలిపారు.  వాటిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విశాఖ జిల్లా పాడేరు, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో  ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద  కేంద్రం ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఈ రోజు రాజ్యసభలో  వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి  అడిగిన  ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ ఏడాది మే 31వ తేదీన వర్చువల్ విధానంలో రాష్ట్రంలో 14 మెడికల్ కళాశాలల   నిర్మాణానికి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకస్ధాపన చేసిన సంగతి తెలిసిందే.

Also Read : UP Election : మోదీతో పాటు యోగి గంగానదిలో ఎందుకు స్నానం చేయలేదంటే..

వాటిలో పాడేరు, పిడుగురాళ్ళ, మచిలీపట్నం కూడా ఉన్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో దానికి రూ.325 కోట్లరూపాయలు ఖర్చు చేసింది. వీటికి సంబంధించిన కేంద్ర వాటా 60 శాతం రూ. 195 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ, అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు.