Chairperson’s war : జమ్మలమడుగు వైసీపీలో ముసలం..అత్తాకోడళ్ల మధ్య చైర్‌పర్సన్‌ వార్‌

కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో ముసలం మొదలైంది. అత్తాకోడళ్ల మధ్య చైర్ పర్సన్ వార్‌ హీట్‌ పుట్టిస్తోంది.

Chairperson’s war : జమ్మలమడుగు వైసీపీలో ముసలం..అత్తాకోడళ్ల మధ్య చైర్‌పర్సన్‌ వార్‌

Chairperson’s War

Updated On : March 17, 2021 / 12:24 PM IST

Chairperson’s war between aunt and cousins : కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో ముసలం మొదలైంది. మున్సిపల్ చైర్ పర్సన్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. అత్తాకోడళ్ల మధ్య చైర్ పర్సన్ వార్‌ హీట్‌ పుట్టిస్తోంది. వంగల జ్ఞాన ప్రసూన .. వేల్పుల శివమ్మ మధ్య పోటా పోటీ నెలకొంది.

మరోవైపు చైర్‌పర్సన్‌ పదవి రేసులో ఉన్న వంగల జ్ఞాన ప్రసూన.. తన చైర్మన్ పదవికి ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. మనస్తాపంతో కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.

బీసీ మహిళలను ఎమ్మెల్యే ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఎప్పుడూ విధేయులమేనని జ్ఞాన ప్రసూన అంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని, టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. అత్త వేల్పుల శివమ్మకు కాకుండా తనకే ఛైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని కోడలు వంగల జ్ఞాన ప్రసూన
అంటోంది.