మండలి రద్దు : వీడియో ద్వారా చంద్రబాబుని అడ్డంగా ఇరికించిన వైసీపీ

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాసన మండలి రద్దుపై సీఎం జగన్... సోమవారం(జనవరి 27,2020) అసెంబ్లీలో

  • Published By: veegamteam ,Published On : January 27, 2020 / 09:11 AM IST
మండలి రద్దు : వీడియో ద్వారా చంద్రబాబుని అడ్డంగా ఇరికించిన వైసీపీ

Updated On : January 27, 2020 / 9:11 AM IST

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాసన మండలి రద్దుపై సీఎం జగన్… సోమవారం(జనవరి 27,2020) అసెంబ్లీలో

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాసన మండలి రద్దుపై సీఎం జగన్… సోమవారం(జనవరి 27,2020) అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పేర్ని నాని ఏకంగా ఓ వీడియోని సభలో ప్రదర్శించారు. మండలి రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుని అడ్డంగా ఇరికించేలా వీడియో ప్రదర్శించారు. 2004లో మండలి పునరుద్దరణ గురించి చంద్రబాబు ఏమన్నారో మీరే చూడండి అంటూ.. చంద్రబాబు స్పీచ్ ని వినిపించారు.

ఈ రోజు శాసన మండలి ప్రయోజనాలు, అవసరాలు, ప్రాధాన్యం, ప్రాముఖ్యతపై ఎన్నో మాటలు చెబుతున్న ఇదే చంద్రబాబు… 2004లో మండలి గురించి ఏం మాట్లాడారో వీడియోలో చూడండి అంటూ అసెంబ్లీలో సభ్యులకు వీడియోని ప్లే చేసి చూపించారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి… మండలిని తిరిగి ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. మండలి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అందులో చంద్రబాబు అనడం ఉంది. మండలి వల్ల ప్రజాధనం వృథా తప్ప ఎలాంటి లాభం లేదన్నారు చంద్రబాబు.

11

వైఎస్ వర్గీయులకు పదవుల కోసమే మండలి:
ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే.. ”మండలి ఏర్పాటు వల్ల ఏ ప్రయోజనమూ లేదు. కేవలం వైఎస్ కి చెందిన వారికి పదవులు ఇవ్వడానికే మండలిని తిరిగి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు తప్ప మరో ప్రయోజనం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు మండలి ద్వారా రాజకీయ పునరావాసం కల్పించాలనుకుంటున్నారు. మండలి వల్ల బ్రహ్మాండమైన చట్టాలు రావు. రాష్ట్రానికి ప్రయోజనం కలగదు. చారిత్రక పరంగా చూసినా ఆ మండలి అవసరం లేదు. అసెంబ్లీలో 294 మందిలో మంచి క్వాలిటీ, అనుభవం ఉన్న సభ్యులు వచ్చారన్న చంద్రబాబు… మండలి అవసరమే లేదన్నారు. మండలి వల్ల ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. బిల్లులు ఆమోదం ఆలస్యం అవుతుందన్నారు. ఏదైనా ఓ బిల్లు చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి 4 నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్‌గా ఆ బిల్లు చట్టంగా అవుతుంది. మండలికి కొన్ని అధికారాలే వస్తాయి. అందులో మేధావులు వస్తారన్న అభిప్రాయం కూడా లేదు” అని నిండు శాసనసభలో చంద్రబాబు అన్నారు.

ys

చంద్రబాబు జీవితమంతా U-టర్న్ లే:
ఈ వీడియోని సభలో ప్రదర్శించిన మంత్రి పేర్నినాని.. చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదండి చంద్రబాబు నైజం అని చెప్పారు. చంద్రబాబు జీవితమంతా యూటర్న్ లే అన్నారు. యూటర్న్ లు తీసుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు. నాడు మండలి వల్ల ప్రయోజనం లేదన్న చంద్రబాబు.. నేడు మండలి రద్దు నిర్ణయం సరికాదనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవంతో… రకరకాల చేతబడులు చేశారని విమర్శించిన మంత్రి… జగన్ కాలి గోటిని కూడా కదపలేరని అన్నారు. నాడు బీజేపీని, కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు.. అదే పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. యూటర్న్ లు తీసుకోవడం చంద్రబాబుకి ఉన్న గొప్ప లక్షణం అన్నారు. అలాంటి లక్షణం అందరికీ ఉండదన్నారు. కోటి మందిలో ఒకరికి మాత్రమే అలాంటి లక్షణం ఉంటుందని.. అది చంద్రబాబుకి ఉందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.

 

3

వైరల్ గా మారిన చంద్రబాబు వీడియో:
మొన్న మండలి రద్దు ప్రతిపాదన చేస్తూ… సీఎం జగన్ ఏ వ్యాఖ్యలైతే చేశారో… వైఎస్ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉంటూ… చంద్రబాబు కూడా అవే వ్యాఖ్యలు చేశారని ఈ వీడియో ద్వారా వైసీపీ అంటోంది. ఈ వీడియోని ప్రజలకు చూపించిన వైసీపీ.. చంద్రబాబుని అడ్డంగా ఇరికించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో అసెంబ్లీలో మండలి రద్దు గురించి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణులు ఆ వీడియోని తెగ షేర్ చేస్తున్నాయి. యూటర్న్ కు చంద్రబాబు పెట్టింది పేరు అని వైసీపీ నేతలు అంటున్నారు.

ఏపీ శాసన మండలి చరిత్ర:
* 1958, జూలై 8న ఏపీ శాసన మండలి ఆవిర్భావం
* 1985లో ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దు
* 1989లో మండలి పునరుద్ధరణకు చెన్నారెడ్డి ప్రయత్నం

* 2004లో మండలి పునరుద్దరణకు వైఎస్ నిర్ణయం
* 2007 మార్చి 30న శాసన మండలి పునరుద్ధరణ
* 2020 జనవరి 27న మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం