టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా విడుదల.. భీమిలి స్థానం గంటాకే

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెండింగ్ స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు.

టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా విడుదల.. భీమిలి స్థానం గంటాకే

chandrababu naidu

TDP MLA, MP Candidate Final List : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల నాల్గో జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితాలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాజా జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతోపాటు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దీంతో పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన 144అసెంబ్లీ, 17పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో నాలుగు దశల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Also Read : టీడీపీ మూడో జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

గంటాకే భీమిలి..
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. గంటాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావించింది. ఈ విషయంపై గంటాను పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. అయితే, గంటా తొలుత భీమిలి కావాలని పట్టుబట్టినప్పటికీ.. తరువాత భీమిలి, చీపురుపల్లి ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తానని తెలిపారు. చివరివరకు గంటా చీపురుపల్లి నుంచే పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు భావించాయి. కానీ, గంటా కోరుకున్నట్లుగానే మరోసారి టీడీపీ అధిష్టానం ఆయన్ను భీమిలి నియోజకవర్గం నుంచే బరిలోకి దింపింది. చీపురుపల్లి అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు పోటీ చేయనున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది. అక్కడ కందికుంట యశోధ పేరును తొలుత ప్రకటించగా.. తాజా జాబితాలో ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు టికెట్ ఇచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్ కు గుంతకల్లు నియోజకవర్గం టికెట్ దక్కింది.

Also Read : కాంగ్రెస్ గూటికి కేకే.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరిక తేదీపై చర్చ

అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
చీపురుపల్లి – కళా వెంకట్రావు
భీమిలి – గంటా శ్రీనివాసరావు
పాడేరు – వెంకట రమేశ్ నాయుడు
దర్శి – గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు – వీరభద్రగౌడ్
గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్.
అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
కదిరి – కందికుంట వెంకటప్రసాద్

పార్లమెంట్ అభ్యర్థులు వీరే..
విజయనగరం – కలిశెట్టి అప్పలనాయుడు
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
కడప – భూపేశ్ రెడ్డి
అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ