టీడీపీ మూడో జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది.

టీడీపీ మూడో జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

TDP Third List Released

TDP Candidates Third list : టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు విడతల్లో 128 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మరో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో మూడు విడతల్లో 139 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీడీపీ పోటీ చేయనున్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజాగా 13 నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.

Also Read : Tdp Bjp Seats Issue : గెలిచేవి మీకు, ఓడేవి మాకా? చంద్రబాబుపై బీజేపీ సీనియర్లు సీరియస్

 • పార్లమెంట్ అభ్యర్థులు వీరే..
  శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
  విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
  అమలాపురం – గంటి హరీష్ మాధుర్
  ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
  విజయవాడ – కేశినేని శివనాధ్ (చిన్ని)
  గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
  నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
  బాపట్ల – టి. కృష్ణప్రసాద్
  నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  చిత్తూరు – దుగ్గమళ్ల ప్రసాద్ రావు
  కర్నూలు – బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
  నంద్యాల – బైరెడ్డి శబరి
  హిందూపూర్ – బీకే పార్థసారధి

 

 

 • అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..
  పలాస – గౌతు శిరీష
  పాతపట్నం – మామిడి గోవిందరావు
  శ్రీకాకుళం – గొండు శంకర్
  శృంగవరపుకోట – కోళ్ల లలితా కుమారి
  కాకినాడ సిటీ – వనమూడి వెంకటేశ్వరరావు
  అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు
  పెనమలూరు (ఎస్సీ) – బోడె ప్రసాద్
  మైలవరం – వసంత వెంకట కృష్ణప్రసాద్
  నరసరావుపేట – డాక్టర్ చందలవాడ అరవింద్ బాబు
  చీరాల – మద్దలూరి మాలకొండయ్య యాదవ్
  సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి