Chandrababu Bail : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి.. సోమవారం తీర్పు
చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై 3 రోజుల నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. Chandrababu Bail Petition

Chandrababu Bail Petition
Chandrababu Bail Petition : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు సోమవారానికి వాయిదా పడింది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపింది.
చార్టర్డ్ అకౌంటెంట్ కు నోటీసులు..
టీడీపీకి, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కి చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేసిన వెంకటేశ్వర్లు కూడా ఈ నెల 10వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని సీనియర్ న్యాయవాది సాయిరామ్ తెలిపారు. ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఇవాళ కోర్టులో ప్రధానంగా ఏయే అంశాలపై వాదనలు జరిగాయి? కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదు? బెయిల్ ఇవ్వకూడదని సీఐడీ ఎందుకు కోరుతోంది? ఈ అంశాలకు సంబంధించి హైకోర్టు సీనియర్ న్యాయవాది సాయిరాం కీలక వ్యాఖ్యలు చేశారు.(Chandrababu Bail Petition)
చంద్రబాబుకి ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు?
”రెండు పాయింట్లపై వాదనలు జరిగాయి. ఒకటి చంద్రబాబుని పోలీస్ కస్టడీకి ఇవ్వడం, రెండోది చంద్రబాబు బెయిల్. ఈ రెండు పిటిషన్లపై మూడు రోజుల నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు వాదనలు పూర్తయ్యాయి. తీర్పుని సోమవారానికి వాయిదా వేశారు. ఇవాళ ప్రధానంగా జరిగిన విషయం.. పాయింట్ నెంబర్ 1.. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే 409(బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్).
Also Read..CM Jagan : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్
టీడీపీ ఖాతాలోకి డబ్బులు ఎలా వెళ్లాయి?
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని మా బాగోగులు చూడమని బాధ్యతలు అప్పగిస్తే ఆయన జనాలను మోసం చేసి దుర్మార్గంగా రూ.371 కోట్ల సొమ్మును కొల్లగొట్టి వాళ్ల సూట్ కేసు సంస్థల ద్వారా అక్కడి నుంచి మళ్లీ వీళ్ల బ్యాంకు అకౌంట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలోకి ఎలా జమయ్యాయి అనేది ఆధారాలు, సాక్ష్యాలతో మొత్తం కోర్టుకి సమర్పించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసి కేసుని నీరుగార్చే అవకాశం ఉంటుంది కనుక బెయిల్ ఇవ్వొద్దు అని కోరడం జరిగింది.(Chandrababu Bail Petition)
ఆ ఇద్దరినీ విచారించాల్సి ఉంది..
రెండో విషయం ఏంటంటే.. ఈ కేసుకి సంబంధించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ అనే ఇద్దరు చంద్రబాబు నాయుడు సలహాతో దేశాలు దాటించేశారు. వాళ్లను కూడా తీసుకొచ్చి విచారించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఎదురుగా కూర్చోబెట్టి జరిగిన విషయాలు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. కనుక చంద్రబాబుకి బెయిల్ ఇవ్వకూడదు అనే దానిపై ప్రధానంగా వాదనలు జరిగాయి. పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన వ్యవహారంపైనా వాదనలు జరిగాయి.
5 రోజుల కస్టడీకి ఇవ్వాలని వాదనలు..
ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనేది తెలియాల్సి ఉందని వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ డబ్బుని చార్టర్డ్ అకౌంటెంట్ తన తెలివితో టీడీపీ అకౌంట్స్ లోకి ఎలా మళ్లించారు? ఏ విధంగా అకౌంట్స్ ను తారుమారు చేశారో దీన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కనుక చంద్రబాబుని పోలీస్ కస్టడీకి 5రోజుల పాటు ఇవ్వండని అడిగారు.
Also Read..Janasena: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!
ఆ రహస్యాలను బయటపెట్టే అవకాశమే లేదు..
రూ.27 కోట్లు పార్టీ ఫండ్ అని టీడీపీ నేతలు ఊరికే అనడం కాదు. కోర్టులో ఆధారాలు చూపించాలి. ఫండ్ ఎవరు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకి సమర్పించాల్సి ఉంటుంది. పార్టీ ఫండ్ అని నోటిమాటగా చెప్పడం కుదరదు. కేసు డైరీ ఇచ్చే అవకాశమే లేదు. అది సీఐడీ విచారణలో ఉంది. ఎవరు మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఎవరి దగ్గరి నుంచి కాల్స్ వచ్చాయి? ఇవన్నీ సీఐడీ విచారణలో ఉన్నాయి. విచారణ పూర్తయ్యాక కేసు డైరీని కోర్టుకి సబ్మిట్ చేస్తారే తప్ప, ఎంక్వైరీలో ఉండగానే ఆ రహస్యాలను బయటపెట్టే అవకాశమే లేదు. పెట్టకూడదు కూడా” అని తేల్చి చెప్పారు సీనియర్ న్యాయవాది సాయిరాం.(Chandrababu Bail Petition)