Sajjala Ramakrishna Reddy : ఉచితం పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారు- చంద్రబాబుపై సజ్జల ఫైర్

ఇసుకపై ప్రస్తుతం ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : ఉచితం పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారు- చంద్రబాబుపై సజ్జల ఫైర్

Sajjala Ramakrishna Reddy On Sand Case (Photo : Google)

Updated On : November 3, 2023 / 5:44 PM IST

Sajjala Ramakrishna Reddy On Sand Case : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఇసుకలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై మరో కేసు నమోదు కావడం పట్ల టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అక్రమ కేసులతో చంద్రబాబును జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే అని ఆరోపించారు.

టీడీపీ నేతల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ”చంద్రబాబు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి. అందుకే ఇన్ని కేసులు. ఆధారాలు ఉన్నాయి కనుకే కేసులు పెట్టారు. కేసులో విషయం ఉందా? లేదా? చూడాలి. ఉచిత ఇసుక అన్నారు. ఉచితంగా ఎక్కడైనా దొరికిందా? ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి. కానీ, పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి దందా చేశారు.

Also Read : ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసా? 40వేల కోట్లు దోచిన మీపై ఎన్ని కేసులు పెట్టాలి?- సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారు. నియమాలు పాటించకుండా, క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా చేశారు. చట్టానికి విరుద్ధంగా చేశారు కనుకే చట్ట ప్రకారం కేసు పెట్టారు. ఇసుకపై ప్రస్తుతం ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? టీడీపీకి ఉపాధ్యక్షురాలా?” అని ఫైర్ అయ్యారు సజ్జల.

”చంద్రబాబుపై ఎందుకు తక్కువ కేసులు పెట్టారని అడగాలి. ఇసుకలో ఉచితంగా మార్కెట్‌లో లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్ మీద మాత్రమే దొరికిందా చెప్పాలి. ఉచితంగా అంటే క్రేన్లు, బోట్లతో ఎవరు తోడారు? ఎన్‌జీటీ ఎందుకు ఫైన్ విధించింది. మద్యంలో కూడా ప్రివిలేజ్ కేస్ వేసి తర్వాత దాన్ని తీసేస్తారు. ఈ వ్యవహారంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు పెట్టారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కేవలం చంద్రబాబు ఫ్యామిలీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె కూడా వారం పది రోజుల నుంచే ఇలా మాట్లాడుతున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

Also Read : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ