Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన చంద్రబాబు.. అక్కడే అకీరా..

చంద్రబాబుకు పాదాభివందన చేసి ఆశీర్వాదం తీసుకున్నారు అకీరా నందన్..

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన చంద్రబాబు.. అక్కడే అకీరా..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవడంతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు కలిశారు. భార్యతో కలిసి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఆత్మీయ స్వాగతం పలికారు.

చంద్రబాబుకు శాలువా కప్పి సత్కరించారు. తన తయుడు అకీరా నందన్ ను చంద్రబాబుకి పవన్ పరిచయం చేశారు. చంద్రబాబుకు పాదాభివందన చేసి ఆశీర్వాదం తీసుకున్నారు అకీరా నందన్. చంద్రబాబు నాయుడు జనసేన కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం వంటి అంశాలపై పవన్‌తో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపై కూడా ఇద్దరు చర్చించారు.

Also Read: 100 శాతం కొట్టాం అంటూ గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్.. అదిరిపోయిందంతే..