ఆనాడు అక్కడ నన్ను ఆయనే రక్షించాడు: చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu: రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రైకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదని తెలిపారు.

ఆనాడు అక్కడ నన్ను ఆయనే రక్షించాడు: చంద్రబాబు నాయుడు

ఎన్నో ఎన్నికలు చూశామని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రైకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదని తెలిపారు. తన కుల దైవం వెంకన్న అని, ఏ సంకల్పం చేసినా ఆయనను తలుచుకుంటానని చెప్పారు.

ఆ నాడు అలిపిరిలో వెంకటేశ్వర స్వామే తనను రక్షించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. 2003లో వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలయిందని చెప్పారు. భారత్ అగ్రస్థానంలో ఉండాలని రోజూ ప్రార్థిస్తానని అన్నారు. ఆర్థిక అసమానతలు తొలగాలని చెప్పారు.

టీటీడీతోనే ప్రక్షాళన మొదలు కావాలని తెలిపారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లే తాము ఎన్నికల్లో గెలిచామని చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారని తెలిపారు.

వ్యవస్థలో కూడా కుటుంబానికి అంతటి ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం వల్ల రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పారు. 2047లోగా తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలన్నది తన విజన్ అని అన్నారు. ప్రస్తుతం అమరావతి, పోలవరం అంశాలను సరిచేయాల్సి ఉందని చెప్పారు.

Also Read: మెగా – నందమూరి ఫ్యామిలీలు అంతా గన్నవరం వెళ్తే.. ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్‌కు..