Chandrababu Naidu: కందుకూరు ఘటనలో ప్రధాని పరిహారం ప్రకటించిన తర్వాత సీఎం పరిహారం ప్రకటించారు: చంద్రబాబు

Tension in tdp chief chandrababu naidu tour in kurnool district
Chandrababu Naidu: టీడీపీ నిన్న కందుకూరులో నిర్వహించిన సభలో ఎనిమిది మంది చనిపోవడం బాధకలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి పరిహారం ప్రకటించారని అన్నారు. ప్రధాని స్పందించిన తర్వాత సీఎం పరిహారం ప్రకటించారని వ్యాఖ్యానించారు. కందుకూరు ఘటన పట్ల అందరూ సంఘీభావం తెలపాలని అన్నారు.
ఏపీలోని నెల్లూరు జిల్లా, కందుకూరులో చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో తోపులాట జరిగి ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఇవాళ కావలిలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహించి నిన్నటి ఘటనపై స్పందించారు. ఆత్మ బంధువులు చనిపోయారన్నదే తన ఆవేదన అని చెప్పుకొచ్చారు.
తాను నిన్న సభలో అప్రమత్తం చేసినప్పటికీ, వారిని కాపాడుకోలేకపోయానని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. త్యాగాలు చేసిన వారి రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థిక సాయం చేశామని చెప్పారు. ఆయా కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. తమది బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.
India calls on Pakistan: పాకిస్థాన్‌లో హిందూ మహిళను అతి దారుణంగా చంపిన ఘటనపై భారత్ స్పందన