Chandrababu: పవన్ కళ్యాణ్‌తో పొత్తుపై చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో కుప్పంలో జరుగుతుంది

Chandrababu: పవన్ కళ్యాణ్‌తో పొత్తుపై చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ!

Chandrababu

Updated On : January 6, 2022 / 8:38 PM IST

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో కుప్పంలో జరుగుతుండగా.. పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను కలుపుకుని పోవాలని చంద్రబాబుని ఓ టీడీపీ కార్యకర్త కోరాడు. లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలని, ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదంటూ కార్యకర్తతో చమత్కరించారు చంద్రబాబు. దీంతో
సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. రామకుప్పం మండలం వీరనమల తాండాలో ఘటన చోటుచేసుకుంది.

ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోవాలని, ప్రతి పల్లె తిరిగి ప్రక్షాళన చేస్తానంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. అసెంబ్లీలో వైసీపీ తనను ఎంతగానో అవమానించిందని, ఏపీలో 2019 నుంచి అరాచక పార్టీ అధికారంలో ఉందంటూ విమర్శించారు చంద్రబాబు.

ఎన్ని ఇబ్బందులు, అరాచకాలు ఎదురైనా.. టీడీపీ కార్యకర్తలు అవమానాలు ఎదుర్కొని అండగా నిలబడుతున్నారని అన్నారు చంద్రబాబు. కార్యకర్తలపై దెబ్బ పడిందంటే మాత్రం.. తనమీద పడినట్లేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను ఎవరినీ వదలిపెట్టనని హెచ్చరించారు. కుప్పంను సరిచేస్తాను తప్ప వదలి పెట్టనని చెప్పారు చంద్రబాబు.

Read More : Ajith Kumar : కరోనా దెబ్బ.. ‘వలిమై’ని వాయిదా వేసిన బోనీ కపూర్