Chandrababu Naidu: జమిలి ఎన్నికలపై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో తమ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Chandrababu Naidu
Chandrababu Naidu – TDP: జమిలి ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం(Rayadurgam)లో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నారని, జమిలి ఎన్నికలు రావచ్చని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక వేళ అది జరిగితే సైకోలాంటి జగన్ పాలన పీడా ముందుగానే విరుగడ అవుతుందని విమర్శించారు. తమ పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాయదుర్గం సాక్షిగా వైసీపీని భూ స్థాపితం చేద్దామని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ఇక ఇంటికి వెళతారని చెప్పారు. ఆయన ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరుతూ ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇటువంటి పాలన అందిస్తారని ముందే తెలిస్తే ఆయనకు ప్రజలు చాన్స్ ఇచ్చేవారు కాదని చెప్పారు.
ప్రజల జీవితాలు బాగుంటే తాను ఏపీలో తిరగాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు అన్నారు. అంతేగానీ, తనకు రాజకీయాలు అవసరంలేదని చెప్పారు. ఉన్మాదుల పాలన కొనసాగుతోందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనప్పుడు, మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెడుతున్నారని ఆయన నిలదీశారు.
ఏపీలో విద్యుత్తు బిల్లులను భారీగా పెంచారని చంద్రబాబు విమర్శించారు. అలాగే, దేశంలో ఎక్కడా లేనంతగా విద్యుత్ కోతలు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పటికీ ఏపీలో విధ్వంసం ఆగలేదని చెప్పారు.
INDIA: అందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.. వస్తాం: కాంగ్రెస్