మమతకు మద్దతుగా: ఇవాళ,రేపు బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం

తృణముల్ కాంగ్రెస్ కు మద్దతుగా రెండు రోజులు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇవాళ(మే-8,2019)ఉదయం కోల్ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అక్కణ్నుంచి ఝర్‌గ్రామ్, హల్దియాలో జరిగే సభలకు మమతతో కలిసి హాజరవుతారు. గురువారం ఖరగ్‌పూర్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఖరగ్ పూర్ లో మీటింగ్ తర్వాత మమత,చంద్రబాబు కోల్ కతా బయల్దేరతారు. గురువారం సాయంత్రం ఇద్దరు సీఎంల మధ్య సమావేశం జరగనుంది.గురువారం రాత్రి ఏపీకి చంద్రబాబు బయల్దేరతారు.ఏపీలో ఎన్నికల ప్రచారసమయంలో చంద్రబాబుకు మద్దుతుగా విశాఖలో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో మమత పాల్గొన్న విషయం తెలిసిందే.