Chandrababu Naidu: జైలులో చంద్రబాబు నిరసన దీక్ష.. మేమందరం కలిసి..: టీడీపీ నేతల ప్రకటన
ఢిల్లీలో నారా లోకేశ్ దీక్షకు దిగుతారని అన్నారు. జగన్ ను శాశ్వతంగా జైలులో ఉంచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.

chandrababu Naidu
Chandrababu Arrest: గాంధీ జయంత్రి సందర్భంగా సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరసన దీక్షకు దిగుతారని టీడీపీ ప్రకటించింది. ఇవాళ అమరావతిలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజమండ్రిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో తాను నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో టీడీపీ నాయకులు సంఘీభావంగా నిరాహార దీక్షలు చేస్తారని వివరించారు.
సీఎం జగన్ నిరంకుశ పాలన నుంచి ఏపీకి విముక్తి కలగాలని కోరుతూ గాంధీ జయంతి రోజు నిరాహార దీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్షల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో నారా లోకేశ్ దీక్ష
మరోవైపు, రాజమండ్రిలో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. జైలులో చంద్రబాబు, రాజమండ్రి క్వారీ సెంటర్ వద్ద భువనేశ్వరి దీక్షలు ఉంటాయని వివరించారు. ఢిల్లీలో నారా లోకేశ్ దీక్షకు దిగుతారని అన్నారు. జగన్ ను శాశ్వతంగా జైలులో ఉంచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.
KTR : కాంగ్రెస్ వస్తే ఏడాదికొక సీఎం మారడం, స్కామ్ లు గ్యారంటీ : మంత్రి కేటీఆర్