తెలంగాణ అభ్యంతరాలు, బనకచర్లపై చంద్రబాబు స్పందన.. “తెలంగాణ సైతం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు” అంటూ..

"గోదావరి జలాలను మీరు వాడుకోండి.. ఇక్కడ కూడా వాడతారు" అని అన్నారు.

తెలంగాణ అభ్యంతరాలు, బనకచర్లపై చంద్రబాబు స్పందన.. “తెలంగాణ సైతం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు” అంటూ..

Updated On : June 19, 2025 / 6:02 PM IST

గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సముద్రంలో వృథాగా పోయేనీటిని వినియోగించుకునేందుకు గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు చేపట్టామని వివరించారు.

బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైందికాదని చంద్రబాబు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. “గోదావరి జలాలను మీరు వాడుకోండి.. ఇక్కడ కూడా వాడతారు” అని అన్నారు.

Also Read: వైఎస్ జగన్ ‘పుష్ప2’ సినిమా డైలాగ్‌పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

తెలంగాణ వాడుకునే నీటిపై హామీ ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. “వినియోగించే నీటిపై ఎవరు ఎవరికి రాసిస్తారు? నేను ఎవరినీ మభ్యపెట్టి మోసం చేయను.

మభ్యపెట్టి మోసం చేయడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. నీటి కోసం తెలంగాణ నేతలు ఎవరూ పోరాటాలు చేయాల్సి అవసరం లేదు. మీరు కట్టే ప్రాజెక్టులన్నీ కట్టుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

నేను 40 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఎవరితోనూ గొడవలు, వివాదాలు పెట్టుకోను. రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే నా లక్ష్యం. గోదావరి నీరు వినియోగించుకునేందుకు తెలంగాణ సైతం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.