వీటిపై గంటా 45 నిమిషాల పాటు చర్చించిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
AP TG CMs Meet Updates: హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని చంద్రబాబుకి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. గంటా 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరోసారి సీఏస్‌ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని చంద్రబాబుకి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.
రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మరో ఇద్దరు అధికారులు ఇందులో పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు కందుల దుర్గేశ్, సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర ఉన్నారు.
ఉమ్మడి విభజన సమస్యలపై పరిష్కారంపై చంద్రబాబు, రేవంత్ చర్చించనున్నారు. తొలిసారి ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. భేటీ అనంతరం ఇరువురు సీఎంలు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అలాగే, ప్రజాభవన్ లోనే చంద్రబాబు టీమ్ డిన్నర్ చేస్తుంది.
వీటిపై చర్చ
- షెడ్యూల్డ్ 9, 10 లోని పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా చర్చలు
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- కృష్ణా జలాలవివాదం చర్చ
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చ
- విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి
Also Read: కాంగ్రెస్ ఆకర్ష్.. తెలంగాణ అసెంబ్లీ, మండలిలో బిఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యపడుతుందా?