Chandrababu On Early Elections : వ్యతిరేకత పెరిగింది, ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గడపగడపకు ప్రభుత్వంలో వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని, దీంతో ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని జగన్ కూ అర్థమైందన్నారు చంద్రబాబు.

Chandrababu On Early Elections
Chandrababu On Early Elections : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం ముందస్తు ఎన్నికలు. ఇప్పుడు చర్చంతా దీని మీదే నడుస్తోంది. ఏ పార్టీలో చూసినా, ఏ నలుగురు కూర్చున్నా.. ముందస్తు ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నోట కూడా ముందస్తు ఎన్నికల మాట వినిపించింది.

Babu (4)
ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు చంద్రబాబు. ఇందుకు నిదర్శనం గడపగడపకు వైసీపీలో ఆ పార్టీ నేతలకు ప్రజల నుంచి ఎదురవుతున్న నిలదీతలు, నిరసనలే అన్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలు బూటకం అని ప్రజలకు అర్థమవుతోందన్నారు చంద్రబాబు.
Chandrababu Early Elections : ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Gadapa Gadapaku
గడపగడపకు ప్రభుత్వంలో వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని, దీంతో ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని జగన్ కూ అర్థమైందన్నారు చంద్రబాబు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలు తెలుగు దేశం పార్టీపైనే ఆశలు పెట్టుకున్నారన్న చంద్రబాబు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ ఉండాలని పార్టీ కేడర్ కు ఆదేశాలు ఇచ్చారు.
Chandrababu On Elections : ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయం-చంద్రబాబు
బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లాలని పార్టీ కేడర్ కు సూచించారు చంద్రబాబు. పార్టీ కార్యక్రమాలు, మహానాడు నిర్వహణపై నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నోట వచ్చిన ముందస్తు ఎన్నికల మాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే, నాయకుల నోట నుంచి పదే పదే ముందస్తు మాట వినిపిస్తోంది.