తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు.. పరదాలు కట్టి మళ్లీ తీసేసిన అధికారులు
Chandrababu Naidu: తన పర్యటనల్లో అనవసరపు ఆంక్షలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు.

Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటిస్తున్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి స్వాగతం పలికారు.
కాగా, మాజీ సీఎం పర్యటనకు కట్టినట్లే ఇప్పుడు కూడా మళ్లీ దారి వెంట అధికారులు పరదాలు కట్టడంతో అటువంటి పనులు చేయొద్దంటూ వారికి సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి.
తన పర్యటనల్లో అనవసరపు ఆంక్షలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని అన్నారు. దీంతో ఇప్పటికే సీఎం పలుసార్లు చెప్పారని, ఆ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి.
చివరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు. కాగా, గత రాత్రి కడా తిరుమలలోని అతిథిగృహం వద్ద మంత్రి నారా లోకేశ్ పరదాలు కట్టి ఉండటాన్ని గమనించి, ఇంకా పరదాల సంస్కృతి పోలేదా అని అడిగారు. వద్దని చెప్పినప్పటికీ ఇప్పుడు కడా కొనసాగిస్తున్నారని చెప్పారు.
తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ, పోలీసులపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులని కోరిన లోకేష్.#LokeshInTirumala #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/VcksHpmAQ9
— Telugu Desam Party (@JaiTDP) June 12, 2024
Also Read: పిన్నెల్లి కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించిన ప్రభుత్వం