Suspicious Death : విజయవాడలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ అనుమానాస్పద మృతి

విజయవాడలో దారుణం జరిగింది. గుణదల గంగిరెద్దులదిబ్బ దగ్గర ఓ ఇంట్లో చార్టర్డ్ అకౌంటెంట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మృతురాలని చెరుకూరి సింధు

Suspicious Death : విజయవాడలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ అనుమానాస్పద మృతి

Suspicious Death

Updated On : August 21, 2021 / 8:10 PM IST

Suspicious Death : విజయవాడలో దారుణం జరిగింది. గుణదల గంగిరెద్దులదిబ్బ దగ్గర ఓ ఇంట్లో చార్టర్డ్ అకౌంటెంట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మృతురాలని చెరుకూరి సింధుగా గుర్తించారు. సింధు తలకు బలమైన గాయం ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

తమ కుమార్తెది హత్యేనని సింధు తల్లిదండ్రులు అంటున్నారు. సింధును ఆమె సన్నిహితుడు ప్రసేన్ చంపాడని ఆరోపిస్తున్నారు. సింధు, ప్రసేన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించ లేదు. లాక్ డౌన్ తర్వాత ప్రసేన్ ఇంట్లోనే సింధు ఉంటోంది. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. సింధు చనిపోయింది. ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతురాలి తల్లిదండ్రులు ఎంపీ కేశినేని నానిని కోరారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరుపుతున్నారు.