మరో మోసం : రూ.కోటితో చీటీల వ్యాపారి పరారీ
చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో

చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో
చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో అమ్ములు, భాస్కర్ దంపతులు చీటీల వ్యాపారం చేస్తున్నారు. మంచిగా ఉంటూ అందరిని నమ్మించారు. చీటీలు కట్టించారు. ఈ దంపతులను నమ్మిన స్థానికులు కొందరు చీటీలు కట్టారు. డబ్బు చూసి ఆశ పుట్టిందో మరో కారణమో కానీ.. భాస్కర్ దంపతులు ఎస్కేప్ అయ్యారు. 30 మందికి కోటి రూపాయలు టోకరా వేశారు. రాత్రికి రాత్రే డబ్బుతో ఉడాయించారు. విషయం తెలిసిన బాధితులు లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దంపతుల కోసం గాలిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చీటీల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముందు నమ్మకంగా ఉంటారు. కొన్ని ఏళ్లుగా కరెక్ట్ గా డబ్బు చెల్లిస్తారు. ఇలా.. ఎక్కువ మంది పోగయ్యాక.. దుర్భుద్ది మొదలవుతుంది. పెద్ద మొత్తంలో నగదు చూశాక కొందరు చీటీల వ్యాపారులు తమ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా డబ్బుతో ఎస్కేప్ అవుతున్నారు. ఎంతో కష్టపడి పైసా పైసా సంపాదించి చీటీలు కట్టినవారు అడ్డండా మోసపోతున్నారు. అవసరానికి డబ్బు వస్తుందని కొందరు చీటీలు కడుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుని వారికి ఇస్తున్నారు. ఆ తర్వాత మోసపోయామని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు అనేకం వెలుగు చూశాయి. చీటీల వ్యాపారం గురించి పోలీసులు అనేక సూచనలు, హెచ్చరికలు కూడా చేశారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అయినా.. కొందరు గుడ్డిగా నమ్మి మోసపోతూనే ఉన్నారు. మోసపోయే వారు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయని పోలీసులు అంటున్నారు. మన అప్రమత్తతే మనకు రక్ష అని చెబుతున్నారు.