Chandrababu Naidu: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. ఎందుకంటే?
రిమాండ్ ముగుస్తుండడంతో కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. ఆర్డర్ ఇప్పుడు ఇస్తే..

Chandrababu Naidu
Chandrababu Naidu – ACB : టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి సీఐడీ (CID) కస్టడీ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉండడంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని ఏసీబీ కోర్టు తెలిపింది.
రిమాండ్ ముగుస్తుండడంతో కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. ఆర్డర్ ఇప్పుడు ఇస్తే.. రేపు స్క్వాష్ పిటిషన్ బట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. అయినప్పటికీ కోర్టు తమ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటిస్తామని తెలిపింది.
వాదనలు ఇలాసాగాయి..
కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుందని సీఐడీ తెలిపింది. కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుందని సీఐడీ చెప్పింది. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారని పేర్కొంది. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యమని తెలిపింది.
కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుందని సీఐడీ తెలిపింది. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారని పేర్కొంది. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యమని తెలిపింది. చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పింది.
దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉందని చెప్పింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని నిజాలు బయటకు వస్తాయని పేర్కొంది. కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని చెప్పింది.
చంద్రబాబు లాయర్ల వాదన ఇది..
ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని కస్టడీ వద్దని ఆయన తరఫు లాయర్లు అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవని చెప్పారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న నేతను జైల్లో పెట్టారని అభ్యంతరాలు తెలిపారు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఇన్ని రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని చెప్పారు.