CM Camp Office : విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, మంత్రులు, అధికారులకు వసతి కల్పనకు కమిటీ
ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

Visakha CM Camp Office
Visakha CM Camp Office : దసరా అనంతరం విశాఖకు పాలన తరలిస్తామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు అనుుగణంగా రంగం సిద్ధమవుతుంది. విశాఖ కేంద్రంగా పాలన సాగించడానికి అడుగులు పడుతున్నాయి. విశాఖకు సీఎంవో తరలింపుపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు సీఎంవో తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలనా శాఖ మానవ వనరుల విభాగ కార్యదర్శులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Nara Lokesh : అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ, సీఎం జగన్‌పై ఫిర్యాదు.. కేంద్రం జోక్యం చేసుకుంటుందా?
ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సివుందని దీని కోసం ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం క్యాంప్ కార్యాలయం, బస ఏర్పాటుతోపాటు సీఎంవోలోని అధికారులకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా తరచూ ఆయా ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు ఆయా జిల్లాల్లో సమీక్ష నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం బుధవారం మరో ఉత్తర్వు విడుదల చేసింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతోపాటు స్థానికంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలాంటి ఏర్పాటు చేయాలన్న దానిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.