నిరుద్యోగులకు రూ.3000 భృతిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన..

ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం.

నిరుద్యోగులకు రూ.3000 భృతిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన..

Updated On : February 28, 2025 / 11:58 AM IST

Cm Chandrababu : చంద్రబాబు సర్కార్ పథకాల అమలుపై ఫోకప్ పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి. ఇక, కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతేకాదు.. త్వరలోనే మత్స్యకారులకు 20వేలు ఇస్తామన్నారు. ఇక, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి అందిస్తామన్నారు. అంతేకాదు.. త్వరలోనే 16వేల 384 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు చంద్రబాబు.

అసెంబ్లీ వేదికగా మత్స్యకారులు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు చంద్రబాబు. స్కీమ్ ల అమలుకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 20 వేలు అందిస్తామన్నారు చంద్రబాబు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భరోసాగా రూ.20 వేలు ఏప్రిల్ నెలలో ఇస్తామని ఇటీవలే పలువురు మంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. 16,384 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.

Also Read : ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతుంటే.. జగన్ ఇకపై రారుగా అని అందరూ అడుగుతున్నారు- నారా లోకేశ్

”ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అలాగే, త్వరలో రైతుభరోసా అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 20వేల రూపాయలు ఇస్తాం. ప్రతి రైతుకు రైతుభరోసా కింద 20వేలు ఇస్తాం. కేంద్రం 6 వేలు ఇస్తుంది. మనం 14వేలు ఇస్తాం. రెండూ మ్యాచ్ చేసి 20వేలు ఇస్తాం.

ఇక మత్స్యకారులకు 20వేలు ఇస్తామన్నాం. చేపల వేటకు వెళ్లని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా హాలీడే ఇస్తాం. ఆ హాలీడే సమయం ముందుగానే వారికి ఇవ్వాల్సిన 20వేల రూపాయల ఆర్థిక సాయం చేసి వారిని కూడా ఆదుకుంటాం.

Also Read : ఆ జబ్బులున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండొచ్చా? ఫాస్టింగ్ తర్వాత వెంటనే తినాల్సిన ఆహారం ఏంటి..

ఇప్పటికే డీఎస్సీ అనౌన్స్ చేశాం. త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇచ్చిన హామీ మేరకు 16,384 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం. రాబోయే సంవత్సరం 16వేల 384 ఉద్యోగాలు రిక్రూట్ చేసి, వారికి ట్రైనింగ్ చేసి, పోస్టింగ్స్ ఇచ్చి, స్కూల్స్ ఓపెన్ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తాం” అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు చంద్రబాబు.