Cm Chandrababu: రేపటి సాయంత్రంలోగా వారికి పరిహారం- అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
విపత్తుల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Cm Chandrababu: అకాల వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల 2 వేల 224 హెక్టార్లలో వరి, 138 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు ప్రభత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు అధికారులు.
Also Read: ఎవరిపై మీ సమరం, ప్రజలపై యుద్ధం చేసి బాగుపడినోళ్లు లేరు- ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ సీరియస్
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
విపత్తుల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మానవత్వంతో వ్యవహరించాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, కొనడం లేదనే మాట రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు.