Cyclone Montha: ముందే ప్లాన్ చేసుకున్నాం.. సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాం- మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు

ఈసారి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని కితాబిచ్చారు. కలెక్టర్లు సమర్ధవంతంగా పని చేశారని ప్రశంసించారు.

Cyclone Montha: ముందే ప్లాన్ చేసుకున్నాం.. సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాం- మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు

Updated On : October 29, 2025 / 4:38 PM IST

Cyclone Montha: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం ఓడలరేవు పునరావస కేంద్రంలో వరద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 3వేల రూపాయల నగదు ఇచ్చారు. అలాగే నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ తుఫాన్ చాలా ప్రమాదకరంగా వస్తుందని తెలుసుకుని ముందుగానే ప్లాన్ చేసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1996లో తుఫాన్ ఈ ప్రాంతాన్ని అతలాకుతం చేసిందని ఆయన గుర్తు చేశారు. నాకు అనుభవం ఉందన్న చంద్రబాబు.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని వివరించారు. రెండు క్యాంపులలో 2 లక్షల 80 వేల మందిని పెట్టామన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందన్నారు.

ఇది రాష్ట్ర విపత్తు అయినప్పటికీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు. నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా విపత్తులు చూశాను అని చంద్రబాబు చెప్పారు. ఈసారి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని చంద్రబాబు కితాబిచ్చారు. కలెక్టర్లు సమర్ధవంతంగా పని చేశారని ప్రశంసించారు. ఈ విపత్తులో ఇద్దరు చనిపోయారని తెలిపారు. ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందన్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే.. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లపై ప్రభావం పడే ప్రమాదం ఉండేదన్నారు.

నెల్లూరు, ప్రకాశంలో వర్షాలు, గాలులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆర్టికల్చర్ నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించిందని, ఇక్కడ జరిగిన నష్టంపై నివేదిక పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Also Read: దిశ మార్చుకున్న మొంథా తుఫాన్.. తెలంగాణాకు తీవ్ర వాయుగుండం ముప్పు.. 16 జిల్లాలకు హైఅలర్ట్..