Cm Chandrababu : ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తాం- సీఎం చంద్రబాబు

టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు పోతాయని అనుకుంటున్నారు. కానీ,

Cm Chandrababu : ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తాం- సీఎం చంద్రబాబు

Updated On : December 7, 2024 / 1:18 AM IST

Cm Chandrababu : ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయంలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిందన్న సీఎం.. ప్రస్తుతం డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ అని చెప్పారు. విశాఖలో డీప్ ఇన్నోవేషన్ సదస్సును ప్రారంభించిన సీఎం.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని చెప్పారు.

”టెక్నాలజీ మన జీవితంలో భాగమైంది. టెక్నాలజీలో రోజుకో కొత్త మార్పు వస్తోంది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనేది ప్రధానం. అభివృద్దికి అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవాలి. టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు పోతాయని అనుకుంటున్నారు. కానీ, టెక్నాలజీ ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లను పరిపాలనలో భాగం చేస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మొబైల్ చేతిలో ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

నేషనల్ కాంక్లేవ్ ఆన్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ కాన్సెప్ట్ తో సదస్సు నిర్వహిస్తున్నారు. ఆయా అంశాలపై 5 సెషన్లుగా నిపుణులతో చర్చలు జరగనున్నాయి. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం, తలసరి ఆదాయం పెంచడమే ప్రధాన అజెండా.

 

Also Read : అధికారం పోయిన 6 నెలల్లోనే.. చంద్రబాబు స్ట్రాటజీనే జగన్ ఫాలో కాబోతున్నారా?