సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఇకపై ఉచితంగా ఇసుక

ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఇకపై ఉచితంగా ఇసుక

CM Chandrababu Naidu on Sand policy : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కీలక అంశాల్లో మార్పులు చేస్తున్నారు. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పాలనాపరంగా పలు నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు.. తాజాగా ఇసుక విషయంలో కీలక డెసిషన్ తీసుకున్నారు.

ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్, రవాణ ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఏపీలో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం అమలుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక పాలసీని తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన రివ్యూ నిర్వహించి నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక విధానాన్ని అమలు చేశారో.. దానిమీద కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : ఆ కేసులు రీఓపెన్..! వైసీపీ కీలక నేతలే టార్గెట్‌గా ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక కొత్త పాలసీని తీసుకొచ్చారు. పలు చోట్ల ఇసుక రీచ్ లు ఏర్పాటు చేశారు. ఇసుక పంపిణీ, తవ్వకాల లైసెన్స్ లు, అనుమతులను.. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం జిరిగింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇసుక ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను వైసీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక.. మళ్లీ ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది.