ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుంది- సీఎం చంద్రబాబు

యూజర్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుంది- సీఎం చంద్రబాబు

Bhogapuram Airport Works : ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ గ్రోత్ ఇంజిన్ లా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో పోర్టులు కూడా ఉన్నాయని, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అంతా కలిసిపోతుందని చెప్పారు. శ్రీకాకుళం నుండి వైజాగ్ వరకు బీచ్ హైవే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు 31.8 శాతం ఎయిర్ పోర్ట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 45 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారని అంచనా వేశారు. రోడ్ల కనెక్టివిటీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యూజర్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

జిల్లా పర్యటన కోసం హెలికాప్టర్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. అంతకుముందు ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేశారు. జీఎంఆర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో విమానాశ్రయ నిర్మాణ పనులపై ప్రజంటేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.

Also Read : వైసీపీలో మొదలైన అలజడి.. ప్రకాశం జెడ్పీ పీఠం కోసం టీడీపీ స్కెచ్..!