Cm Chandrababu Naidu : బటన్ నొక్కే కార్యక్రమం ఎక్కడా సక్సెస్ కాదు, మళ్లీ గర్వంతో మాట్లాడుతున్నారు- జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ఒకసారి అధికారంలోకి వచ్చి అందరి నెత్తిన చేయి పెట్టాడు, 2.0 అంటూ సైకో మాటలు మాట్లాడుతున్నాడు అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు.

Cm Chandrababu Naidu : బటన్ నొక్కే కార్యక్రమం ఎక్కడా సక్సెస్ కాదు, మళ్లీ గర్వంతో మాట్లాడుతున్నారు- జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

Updated On : February 8, 2025 / 6:11 PM IST

Cm Chandrababu Naidu : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. మళ్లీ గర్వంతో మాట్లాడుతున్నారు అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. 30 ఏళ్ళు అధికారం అంటూ జగన్ కలలు కంటున్నారని విమర్శించారు.

ఒకసారి అధికారంలోకి వచ్చి అందరి నెత్తిన చేయి పెట్టాడు, 2.0 అంటూ సైకో మాటలు మాట్లాడుతున్నాడు అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా వెళ్ళను, పాలసీ ప్రకారం వెళ్తాను అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏపీలో బటన్ నొక్కే వ్యక్తికి ప్రజలు విరామం ఇచ్చారని జగన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

దేవతలు ఉండే రుషికొండలో ఒక ప్యాలెస్ కట్టిన వ్యక్తి ఏమయ్యారు? అని ప్రశ్నించారు. 10 లక్షల కోట్లు అప్పులు పెట్టిన వ్యక్తి మళ్ళీ మాటలు మొదలుపెట్టారని విరుచుకుపడ్డారు. బటన్ నొక్కే కార్యక్రమం ఎక్కడా సక్సెస్ కాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.