Cm Chandrabau: 53 చోట్ల కత్తిపోట్లు.. టీడీపీ నేత దారుణ హత్యపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, వారిని వదిలేది లేదని వార్నింగ్

టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముసుగులు వేసుకుని వచ్చిన దుండగులు కత్తులతో నరికి నరికి చంపారు.

Cm Chandrabau: 53 చోట్ల కత్తిపోట్లు.. టీడీపీ నేత దారుణ హత్యపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, వారిని వదిలేది లేదని వార్నింగ్

Updated On : April 23, 2025 / 7:52 PM IST

Cm Chandrabau: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. అమ్మనబ్రోలుకు చేరుకున్న చంద్రబాబు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు. వీరయ్య చౌదరి హత్య ఘటనపై 12 టీములు ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు.

నిందితులను పట్టుకుని తీరతామని, కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు చంద్రబాబు. తమ పాలనలో ఇలాంటి ఘటన జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు అన్నారు. వీరయ్య చౌదరి కుటుంబసభ్యులను చంద్రబాబు ఓదార్చారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ, తాను అండగా ఉంటామన్నారు భరోసా ఇచ్చారు చంద్రబాబు.

టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముసుగులు వేసుకుని వచ్చిన దుండగులు కత్తులతో నరికి నరికి చంపారు. వీరయ్య చౌదరి శరీరంపై 53 కత్తిపోట్లు ఉన్నట్లు తెలుసుకుని చంద్రబాబు షాక్ కి గురయ్యారు. వీరయ్య చౌదరి హత్యోదంతంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు 12 బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో హింసకు తావులేదన్నారు చంద్రబాబు.

Also Read: జమ్ముకశ్మీర్‌పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఆ వ్యాఖ్యలే ముష్కరుల మారణహామానికి కారణమా?

ఈ హత్య జరిగిన విధానం చూస్తే.. కరడుగట్టిన క్రిమినల్స్ సైతం చేయని రీతిలో ఉందన్నారు చంద్రబాబు. భౌతికకాయంపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని తెలిసి షాక్ కి గురయ్యారు. ఇది చూశాక రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా? అనిపిస్తోందన్నారు. వీరయ్య చౌదరి హత్యకు కారణాలను పరిశీలిస్తున్నామని.. వ్యక్తిగత కక్షలా? ఆర్థిక వ్యవహారాలా? రాజకీయంగా ఎదుగుదల తట్టుకోలేక చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. నేర రాజకీయాలు చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు చంద్రబాబు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు, దొరికే వరకూ గాలిస్తామన్నారు చంద్రబాబు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here