Cm Chandrababu: పార్టీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలమయ్యారంటూ అసహనం

ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు చంద్రబాబు.

Cm Chandrababu: పార్టీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలమయ్యారంటూ అసహనం

Updated On : June 24, 2025 / 5:32 PM IST

Cm Chandrababu: ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ్టి అజెండాలో 42 అంశాలను చేర్చారు. సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు వస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కూడా క్యాబినెట్ లో కీలక చర్చ జరిగింది. ఏపీ చేపట్టిన ప్రాజెక్ట్ తో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు చంద్రబాబు. ఇది సున్నితమైన అంశం అని, ఎవరూ ఎలా పడితే అలా మాట్లాడొద్దన్నారు. దీనికి సంబంధించిన వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు.

అవసరమైతే కేంద్రం కూడా జోక్యం చేసుకుని ఏపీ, తెలంగాణతో చర్చిస్తే మన వాదనలు మనం వినిపించవచ్చన్నారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్లే అక్కడ కొందరు నేతలు బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నారని క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం.

ఏపీ క్యాబినెట్ లో కొందరు పార్టీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోవడంలో నాయకులు విఫలం అవుతున్నారని అన్నారు. డిమాండ్ తక్కువగా ఉన్నా పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలకు వివరించాలని, డిమాండ్ కు తగినట్లుగా వాణిజ్య పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలని చంద్రబాబు సూచించారు.

క్యాబినెట్ అజెండా అంశాల చర్చ అనంతరం రాజకీయ అంశాలపైనా చంద్రబాబు చర్చించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ పై తెలంగాణకున్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ద్వారా వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ కు ఎటువంటి నష్టమూ లేదని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా మనం అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం-బనకచర్లపై నేతలంతా మాట్లాడాలన్నారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు చంద్రబాబు.

Also Read: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం